భారత్ టూర్ కు వచ్చిన న్యూజిలాండ్ తో టీమిండియా ఈ రోజు రెండో టీ ట్వంటి మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్ రాంచీ వేదిక గా జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ ను గెలిచి మూడు టీ ట్వంటి మ్యాచ్ ల సిరిస్ ను కైవసం చేసుకోవాలని టీమిండియా ఆరట పడుతుంది. అలాగే ఈ మ్యాచ్ ను ఎలగైనా.. గెలిచి సిరిస్ పోటీలో ఉండాలని న్యూజిలాండ్ ప్రయత్నిస్తుంది. అయితే చివరి మ్యాచ్ లో టిమిండియా నుంచి కెప్టెన్ రోహిత్ తో పాటు సూర్య కుమార్ యాదవ్ తప్ప ఎవరూ కూడా పెద్ద గా ఆడలేదు.
ముఖ్యంగా టీమిండియా మిడిల్ ఆర్డర్ న్యూజిలాండ్ బౌలర్ల కు చేతులు ఎత్తేసింది. ఈ మ్యాచ్ లో ఓపెనర్ల తో పాటు మిడిల్ ఆర్డర్ కూడా రాణిస్తేనే టీమిండియా విజయం దక్కుతుంది. మొదటి మ్యాచ్ లో గాయపడ్డ టీమిండియా పేసర్ మహ్మద్ సిరాజ్ ఈ మ్యాచ్ ఆడక పోవచ్చు. దీంతో సిరాజ్ స్థానంలో ఎవరిని ఆడిస్తారా అనే ఉత్కంఠ కూడా ఉంది. అయితే భూవనేశ్వర్, అశ్వన్ మంచి ఫామ్ లో ఉండటం టీమిండియా కు కలిసి వచ్చే అంశం అని చెప్పాలి.