పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ భారత క్రికెటర్లను ప్రశంసించినందుకు తనను విమర్శించిన వారికీ ఘాటు సమాధానం చెప్పాడు. పాకిస్తాన్ మరియు భారత క్రికెట్ జట్ల ఆటతీరును ఎప్పటికప్పుడు సమీక్షించే అక్తర్… టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై కూడా ప్రసంశలు కురిపించాడు. “నేను భారత ఆటగాళ్లను, విరాట్ కోహ్లీని ఎందుకు ప్రశంసించకూడదు? పాకిస్తాన్ లో, లేదా ప్రపంచవ్యాప్తంగా, కోహ్లీకి దగ్గరగా ఉన్న ఆటగాడు ఎవరైనా ఉన్నారా? ” అని అక్తర్ ఎదురు ప్రశ్నించాడు.
ప్రజలు ఎందుకు కోపంగా ఉన్నారో నాకు తెలియదు, వారు నన్ను విమర్శించే ముందు గణాంకాలను చూడాలి. అతను భారతీయుడు కాబట్టి, మేము అతనిని ప్రశంసించము అని వారు ద్వేషాన్ని దృష్టిలో పెట్టుకోవాలని అనుకుంటున్నారా…? అని నిలదీశాడు. “కోహ్లీకి ప్రస్తుతం 70 అంతర్జాతీయ సెంచరీలు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్‌లో ప్రస్తుతం ఇన్ని సెంచరీలు ఎవరు సాధించారని ప్రశ్నించాడు.