మహిళా రెజ్లర్లకు భద్రత పునరుద్ధరించండి.. బ్రిజ్ భూషన్ కేసులో దిల్లీ హైకోర్టు

-

భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలు అప్పట్లో పెద్ద సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఆయనకు వ్యతిరేకంగా మహిళా రెజ్లర్లు పెద్ద ఎత్తున ఆందోళనలు కూడా చేశారు. ఈ నేపథ్యంలో బ్రిజ్ భూషణ్కు వ్యతిరేకంగా ఆందోళన చేసిన మహిళా రెజ్లర్‌కు వెంటనే భద్రతను పునరుద్ధరించాలని దిల్లీ కోర్టు నగర పోలీసులను ఆదేశించింది.

ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ప్రియాంక రాజ్‌పూత్ .. మహిళా రెజ్లర్ తన స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేయడానికి శుక్రవారం కోర్టుకు హాజరుకావాలని సూచించారు. ముగ్గురు రెజ్లర్లకు బుధవారం రాత్రి భద్రతను ఉపసంహరించుకున్నారని వారి తరఫున న్యాయవాది రెబెక్కా జాన్ పిటిషన్ దాఖలు చేయడంతో దీనిపై దిల్లీ హైకోర్టు గురువారం రోజున విచారణ చేపట్టింది. ఈ మేరకు అడిషనల్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ .. రెజ్లర్లకు భద్రతను ఉపసంహరించుకోవడానికి గల కారణాలపై శుక్రవారంలోగా వివరణాత్మక నివేదికను సమర్పించాలని పోలీసులను ఆదేశించారు.

Read more RELATED
Recommended to you

Latest news