Dhoni likely to visit London for surgery: లండన్ కు మహేంద్ర సింగ్ ధోని పయనం కానున్నాడు. తొడ కండర గాయంతో ఇబ్బందిపడుతున్న ధోనీ త్వరలోనే లండన్ వెళ్లి శస్త్ర చికిత్స చేయించుకుంటారని సీఎస్కే వర్గాలు వెల్లడించాయి. అనంతరం ధోని కోలుకోవడానికి 5-6 నెలల సమయం పడుతుందని తెలిపాయి.

ఆ తర్వాత అతను తన భవిష్యత్తు గురించి నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నాయి. కాగా ఐపిఎల్ ప్రారంభానికి ముందు నుంచే గాయంతో ఇబ్బంది పడుతున్న ధోని మరో కీపర్ కి కూడా గాయం కావడంతో తప్పని పరిస్థితుల్లో తనే ఓర్చుకొని ఈ సీజన్ ఆడారు. కాగా మొన్న ఆర్జీబీపై చెన్నై సూపర్ కింగ్స్ ఓడిన సంగతి తెలిసిందే.