నా చిరకాల కల నెరవేరింది – క్రికెటర్‌ దినేష్ కార్తిక్

T20 World Cup : ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ లో ప్రారంభమయ్యే టి-20 ప్రపంచ కప్ కు భారత జట్టును బీసీసీఐ నిన్న ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ టీంలో అనూహ్యంగా.. దినేష్‌ కార్తిక్‌ ఎంపిక అయ్యాడు. అయితే.. టీమిండియా టి20 ప్రపంచ కప్ జట్టులో చోటు దక్కడంపై వేటరన్ వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ సంతోషం వ్యక్తం చేశాడు. తన కళ నెరవేరిందని ట్వీట్ చేశాడు. ఇక 15 మంది సభ్యులతో కూడిన జట్టును బీసీసీఐ సోమవారం ప్రకటించింది.

చేతన్ శర్మ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ ప్రత్యేకంగా సమావేశమై జట్టు వివరాలను వెల్లడించింది. అంతా ఊహించినట్లుగానే గాయాలతో జట్టుకు దూరమైన జస్ట్ ప్రీత్ బూమ్రా, హర్షల్ పటేల్ పునరాగమనం చేయగా, ఆసియాకప్ 2022 లో విఫలమైన ఆవేశ్ ఖాన్ పై వేటు పడింది. టీము కాంబినేషన్ నేపథ్యంలో యువ స్పిన్నర్ రవి బిస్నోయి కూడా టీం మేనేజ్మెంట్ పక్కన పెట్టి స్టాండ్ బై ప్లేయర్ గా ఎంపిక చేసింది. మహమ్మద్ షమీ జట్టులోకి వస్తాడని ప్రచారం జరిగిన అతని బూమ్రా బ్యాక్అప్ గా మాత్రమే సెలెక్టర్లు పరిగణించారు. అతనితో పాటు దీపక్ చాహార్, రవి బిస్నోయి, శ్రేయస్ అయ్యర్ లను స్టాండ్ బై ప్లేయర్ గా ఎంపిక చేసింది. ఆసియా కప్ బరిలోకి దిగిన జట్టులో కేవలం మూడు మార్పులు మాత్రమే చేసింది.