తొలి ఇన్నింగ్ లో 246 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌట్..!

-

హైదరాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో భారత్-ఇంగ్లండ్ మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ జట్టు 246 పరుగులకు ఆలౌట్ అయింది. జడేజా, అశ్విన్ చెరో మూడు వికెట్లు తీశారు. అక్షర్, బుమ్రాలకు 2 వికెట్లు తీశారు. లంచ్ బ్రేకు కి ముందు 3 వికెట్లు, లంచ్ బ్రేక్ తరువాత 2,  మొత్తానికి తొలిరోజే ఇంగ్లండ్ ఆలౌట్ అయింది. బెన్ స్టోక్స్ అత్యధిక స్కోర్ 70 పరుగులు చేశాడు.

ఇంగ్లండ్ జట్టు స్కోరు ని పరిశీలించినట్టయితే.. 64.3 ఓవర్లలో 246 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్లు క్రాలే, డకెట్ 20, 35 పరుగులు చేశారు. పోప్ 1, రూట్ 29, బెయిర్ స్టో 37, బెన్ స్టోక్స్ 70, ఫోక్స్ 4, అహ్మద్ 13, హార్ట్ లే 23, వుడ్ 11, లీచ్ 0 పరుగులు చేశారు. హైదరాబాద్ బౌలర్ సిరాజ్ కి ఉప్పల్ స్టేడియంలో  ఒక్క వికెట్ కూడా పడకపోవడం గమనార్హం.

 

Read more RELATED
Recommended to you

Latest news