సెమీఫైన‌ల్ స్థానాన్ని ఖాయం చేసుకున్న ఇంగ్లండ్‌.. కివీస్‌పై భారీ గెలుపు..!

-

ఐసీసీ వ‌రల్డ్ క‌ప్ 2019 టోర్నీ సెమీ ఫైన‌ల్‌లో ఇంగ్లండ్ త‌న స్థానాన్ని ఖాయం చేసుకుంది. ఇవాళ చెస్ట‌ర్ లి స్ట్రీలో జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ 119 ప‌రుగుల భారీ తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

ఐసీసీ వ‌రల్డ్ క‌ప్ 2019 టోర్నీ సెమీ ఫైన‌ల్‌లో ఇంగ్లండ్ త‌న స్థానాన్ని ఖాయం చేసుకుంది. ఇవాళ చెస్ట‌ర్ లి స్ట్రీలో జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ 119 ప‌రుగుల భారీ తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఈ క్ర‌మంలోనే కివీస్ త‌న సెమీస్ అవ‌కాశాల‌ను మ‌రింత క‌ష్ట‌త‌రం చేసుకోగా.. ఈ నెల 5న బంగ్లాదేశ్‌, పాకిస్థాన్ జ‌ట్ల మ‌ధ్య జ‌ర‌గ‌నున్న మ్యాచ్ ఫ‌లితంతో కివీస్ సెమీస్ లోకి వెళ్తుందో, లేదో తేల‌నుంది.

కాగా మ్యాచ్‌లో టాస్ గెలిచి ఇంగ్లండ్‌ ముందుగా బ్యాటింగ్ చేప‌ట్టా.. ఆ జ‌ట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 305 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ల‌లో జానీ బెయిర్‌స్టో (99 బంతుల్లో 106 పరుగులు, 15 ఫోర్లు, 1 సిక్సర్), జేసన్ రాయ్ (61 బంతుల్లో 60 పరుగులు, 8 ఫోర్లు)లు రాణించారు. ఇక కివీస్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, మ్యాట్ హెన్రీ, జేమ్స్ నీషంల‌కు తలా 2 వికెట్లు ద‌క్క‌గా, మిచెల్ శాన్టనర్, టిమ్ సౌతీల‌కు చెరొక వికెట్ ద‌క్కింది.

అనంతరం ఇన్నింగ్స్ ప్రారంభించిన న్యూజిలాండ్ ఎప్ప‌టికప్పుడు వికెట్ల‌ను కోల్పోయి క‌ష్టాల్లో పడింది. దీంతో ఆ జ‌ట్టు 45 ఓవర్లలో 186 పరుగులు మాత్రమే చేసి ఆలౌట్ అయి మ్యాచ్‌లో ఓట‌మి పాలైంది. ఇక కివీస్ బ్యాట్స్‌మెన్లలో టామ్ లాథమ్ (65 బంతుల్లో 57 పరుగులు, 5 ఫోర్లు) ఒక్కడే రాణించ‌గా, మిగిలిన బ్యాట్స్‌మెన్‌ ఎవరూ చెప్పుకోదగిన స్కోరు చేయలేదు. కాగా ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3 వికెట్లు తీయ‌గా, క్రిస్ వోక్స్, జోఫ్రా ఆర్చర్, లియామ్ ప్లంకెట్, ఆదిల్ రషీద్, బెన్ స్టోక్స్‌ల‌కు తలా 1 వికెట్ ద‌క్కింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version