అంద‌రూ ఊహించిందే.. ఆఫ్గ‌నిస్థాన్‌పై గెలిచిన ఇంగ్లండ్‌..!

-

మాంచెస్ట‌ర్‌లో ఇవాళ జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ మ్యాచ్ లో ఆఫ్గ‌నిస్థాన్‌పై ఇంగ్లండ్ 150 ప‌రుగుల భారీ తేడాతో గెలుపొందింది.

మాంచెస్ట‌ర్‌లో ఇవాళ జ‌రిగిన వ‌న్డే ప్ర‌పంచ క‌ప్ మ్యాచ్ లో ఆఫ్గ‌నిస్థాన్‌పై ఇంగ్లండ్ 150 ప‌రుగుల భారీ తేడాతో గెలుపొందింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 398 ప‌రుగుల భారీ ల‌క్ష్యాన్ని ఛేదించే క్ర‌మంలో ఆఫ్గ‌నిస్థాన్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 8 వికెట్ల‌ను కోల్పోయి 247 ప‌రుగులు చేసింది. అయితే మ్యాచ్ ఫ‌లితాన్ని అంద‌రూ ముందే ఊహించినా.. ఆఫ్గ‌నిస్థాన్ ఎలాగూ గెల‌వ‌ద‌ని ఆ జ‌ట్టుకే తెలిసినా.. వారు త‌మ పోరాటాన్ని కొనసాగించారు. చివ‌రి వ‌ర‌కు ఆట‌లో నిలిచి భేష్ అనిపించుకున్నారు.

మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 397 పరుగులు చేసింది. ఆ జట్టు బ్యాట్స్‌మెన్లలో కెప్టెన్ మోర్గాన్ (71 బంతుల్లో 148 పరుగులు, 4 ఫోర్లు, 17 సిక్సర్లు), జానీ బెయిర్‌స్టో (99 బంతుల్లో 90 పరుగులు, 8 ఫోర్లు, 3 సిక్సర్లు), జో రూట్ (82 బంతుల్లో 88 పరుగులు, 5 ఫోర్లు, 1 సిక్సర్)లు రాణించారు. ఈ క్ర‌మంలో ఇంగ్లండ్ భారీ స్కోరు చేయ‌గ‌లిగింది. కాగా ఆఫ్గనిస్థాన్‌ బౌలర్లలో దావ్లత్ జద్రాన్, గుల్బదీన్ నయీబ్‌లు చెరో 3 వికెట్లు తీశారు.

అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆఫ్గనిస్థాన్ బ్యాట్స్‌మెన్లలో హష్మతుల్లా షాహిది (100 బంతుల్లో 76 పరుగులు, 5 ఫోర్లు, 2 సిక్సర్లు), రహ్మత్ షా (74 బంతుల్లో 46 పరుగులు, 3 ఫోర్లు, 1 సిక్సర్), అస్గర్ అఫ్గన్ (48 బంతుల్లో 44 పరుగులు, 3 ఫోర్లు, 2 సిక్సర్లు)లు ఫ‌ర్వాలేద‌నిపించారు. అయిన‌ప్ప‌టికీ భారీ ల‌క్ష్యాన్ని ఛేదించ‌డంలో ఆఫ్గ‌న్ బ్యాట్స్‌మెన్ త‌డ‌బ‌డ్డారు. ఎప్ప‌టిక‌ప్పుడు వికెట్ల‌ను కోల్పోయారు. దీంతో ఆ జ‌ట్టుకు ఓట‌మి త‌ప్ప‌లేదు. కాగా ఇంగ్లండ్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్‌ల‌కు చెరో 3 వికెట్లు ద‌క్క‌గా, మార్క్ వుడ్ 2 వికెట్లు తీశాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version