Virat Kohli : గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి కోహ్లీని కౌగిలించుకున్న ఫ్యాన్..వీడియో వైరల్

-

Virat Kohli : గ్రౌండ్‌లోకి దూసుకొచ్చి కోహ్లీని కౌగిలించుకున్నాడు ఓ ఫ్యాన్..  భారత్-ఆఫ్ఘనిస్తాన్ రెండో టీ20 సందర్భంగా ఓ అభిమాని అత్యుత్సాహం ప్రదర్శించాడు. బౌండరీ లైన్ వద్ద నిలబడిన కోహ్లీ కోసం గ్రౌండ్ లోకి దూసుకొచ్చిన అతను విరాట్ ను హగ్ చేసుకున్నాడు.

Fan breaches security to hug Virat Kohli in Indore

ఆఫ్గనిస్తాన్ జట్టు బ్యాటింగ్ చేస్తుండగా 18వ ఓవర్ లో ఈ ఘటన జరిగింది. ఒక్కసారిగా అభిమాని గ్రౌండ్ లో పరిగెత్తి రావడంతో కాస్త గందరగోళం నెలకొంది. కాగా పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.

ఇది ఇలా ఉండగా, భారత క్రికెటర్లు వాషింగ్టన్ సుందర్, తిలక్ వర్మ, జితేష్ శర్మ, రవి బిష్నోయ్ ఉజ్జయిని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ ఆలయాన్ని సందర్శించారు. ఉదయం నిర్వహించిన భస్మహారతిలో వారు పాల్గొన్నారు. నిన్న ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ లో బిష్నోయ్ రెండు వికెట్లు తీశారు. గతంలో భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రాహుల్ దంపతులు ఉజ్జయిని ఆలయాన్ని దర్శించుకున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news