చైనాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. మొదటి రోజు గోల్డ్ మెడల్ దక్కకపోయినా.. ఏకంగా ఐదు పతకాలను ఖాతాలో వేసుకున్నారు. ఇక రెండో రోజైన నేడు తొలి స్వర్ణ పతకాన్ని సాధించింది ఇండియా. ఇవాళ జరిగిన 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో భారత్ గోల్డ్ మెడల్‌ను ముద్దాడింది. ఆసియా క్రీడలు 2023లో భారత్‌కు ఇదే మొదటి పసిడి పతకం కావడం విశేషం.
రుద్రాంక్ష్ పాటిల్, ఐశ్వరీ తోమర్, దివ్యాన్ష్ పన్వర్ బృందం ఈ మెడల్‌ను సొంతం చేసుకుంది. ఇది వరల్డ్ రికార్డ్ కావడం విశేషం. మొత్తంగా షూటింగ్‌లో ఈ ఆసియా క్రీడల్లో ఇప్పటివరకు తాజా దానితో కలిపి మూడు మెడల్స్ వచ్చాయి. అలానే రోయింగ్ విభాగంలో మరో కాంస్య పతకం భారత్‌కు దక్కింది. దీంతో రోయింగ్ విభాగంలో ఇప్పటివరకు నాలుగు మెడల్స్ వచ్చాయి. కాగా, ఆదివారం (మొదటి రోజు) భారత్‌కు ఐదు పతకాలను ముద్దాడిన సంగతి తెలిసిందే. వీటిలో రోయింగ్‌లో రెండు సిల్వర్ మెడల్స్, ఓ బ్రాంజ్ మెడల్.. షూటింగ్‌లో ఓ రజతం, కాంస్యం ఉన్నాయి.
𝟏𝐬𝐭 𝐆𝐨𝐥𝐝 𝐟𝐨𝐫 𝐈𝐧𝐝𝐢𝐚 🇮🇳🥇@RudrankkshP, @DivyanshSinghP7, and Aishwary Pratap Tomar have hit the bullseye and secured the 1️⃣st Gold for India in the 10m Air Rifle Men's Team event at the #AsianGames2022. Teamwork & Precision on point✅👏🏻#JeetegaBharat pic.twitter.com/kdJavy6A3B
— BJYM (@BJYM) September 25, 2023