ఐపీఎల్ 2024 సీజన్‌లో కోల్‌కతా టీమ్కు మెంటార్‌గా వ్యవహరించి ఆ టీమ్ను ఛాంపియన్‌గా నిలిపిన భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌నే టీమ్ ఇండియా ప్రధాన కోచ్‌గా తీసుకోవాలనే సూచనలు వెల్లువెత్తాయి. ఇప్పటికే కోచ్ పదవి కోసం దరఖాస్తుల గడువు కూడా ముగిసిన సంగతి తెలిసిందే. అయితే గంభీర్ ఎంపిక ఇప్పటికే జరిగిపోయిందని ఇక ప్రకటించడం ఒకటే బ్యాలెన్స్ అని తాజా సమాచారం. ఇదే విషయాన్ని బీసీసీఐ వర్గాలకు చాలా దగ్గరగా ఉండే ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
క్రిక్ బజ్ రిపోర్ట్ ప్రకారం.. ‘ఇప్పటికే భారత జట్టు ప్రధాన కోచ్‌గా గంభీర్ ఎంపిక జరిగిందని క్రిక్ బజ్ రిపోర్ట్ ఒకటి పేర్కొంది. ఫ్రాంచైజీతో చర్చలు కూడా జరిగాయని.. అతడి అపాయింట్‌మెంట్‌ను ప్రకటించడమే ఆలస్యమని తెలిపింది. ఇదే మాటను ఐపీఎల్ ఫ్రాంచైజీ ఓనర్‌తోపాటు హై ప్రొఫైల్ కలిగిన కామెంటేటర్ ఇదే విషయాన్ని ధ్రువీకరించారని.. కేకేఆర్ మెంటార్‌గా గంభీర్ చేసిన కృషి అతడిని ఈ పదవికి తీసుకొచ్చింది అని పేర్కొంది.