ముమ్మరంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకల ఏర్పాట్లు..కార్యక్రమాలు ఇవే

-

 

తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. . రాష్ట్ర ముఖ్యమంత్రి తోపాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, యారా ప్రముఖులు హాజరయ్యే ఈ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు సికిందరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లో వివిధ శాఖలు పెద్ద ఎత్తున ఏర్పాట్లను చేపట్టాయి. ఉదయం ముఖ్యమంత్రి గన్-పార్క్ లో అమరవీరుల స్థూపానికి పూల మాలలు సమర్పించి నివాళులు అర్పించిన అనంతరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో పలు కార్యక్రమాలలో ముఖ్యమంత్రి పాల్గొంటారు.

Arrangements for Telangana state formation celebrations are in full swing

ఈ కార్యక్రమంలో హాజరయ్యే దాదాపు ఇరవై వేలమంది పట్టె భారీ షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. వేసవి ఉండడంతో హాజరయ్యే ప్రజలకు, ప్రముఖులకు ఏమాత్రం ఇబ్బందులు లేకుండా ఉండేందుకు తాను జాగ్రత చర్యలు చేపడుతున్నారు. సభా ప్రాంగణంలో ప్రత్యేక మెడికల క్యాంపుల ఏర్పాటు కూడా చేస్తున్నారు. తాగునీటి సౌకర్యములు, తగు టాయిలెట్లను కూడా ఏర్పాటు చేస్తున్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో ఎల్.ఈ.డీ స్క్రీన్ లు, కార్యక్రమ లైవ్ ప్రసారానికి ఏర్పాట్లు చేశారు.

ట్యాంక్ బండ్ పై కనులపండగగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ :
జూన్ 2 వతేదీన సాయంత్రం ట్యాంక్ బండ్ పై పలు సాంస్కృతిక కార్యక్రమాలు, కార్నివాల్, బాణ సంచా లేజర్ షో, ఫుడ్, గేమింగ్ స్టాళ్ళను ఏర్పాటు చేశారు. ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలకు ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రముఖులు హాజరవుతారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన పలు సాంస్కృతిక కళా బృందాలచే కార్నివాల్ ప్రదర్శనలు ఉంటాయి. ప్రధాన స్టేజీ పై పలు శాస్త్రీయ, జానపద, దక్కనీ సాంస్కృతిక కార్యక్రమాలు. తెలంగాణ రాష్ట్ర అధికారిక గీతం ‘జయ జయహే తెలంగాణ’ పై జాతీయ జెండాలతో మార్చ్-ఫాస్ట్.

మిరుమిట్లు గొలిపే ఫైర్ వర్క్స్ ప్రదర్శన :
ట్యాంక్ బండ్ పై దాదాపు 80 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్టాళ్లలో రాష్ట్రంలోని హస్త కళలలు, స్వయం సహాయక బృందాలు తయారు చేసే వస్తువులు, చేనేత ఉత్పత్తులు, నగరం లోని పలు ప్రముఖ హోటళ్ళచే స్టాళ్ళ ఏర్పాటు. చిన్న పిల్లలకు గేమింగ్ షో ల ఏర్పాటు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news