ఆంధ్ర ప్రీమియర్ లీగ్ పేరుతో గత సంవత్సరం ప్రారంభము కాగా రెండవ సీజన్ కు సంబంధించిన వేలం ప్రక్రియ జరిగింది. ఇండియాలో క్రికెట్ కు ఏ విధమైన ఆదరణ ఉందో తెలిసిందే. మన దేశంలో దాదాపుగా ప్రతి రాష్ట్రంలో స్థానిక లీగ్ లు జరుగుతుంటాయి. ఒక్క ఆంధ్రలోనే ఏ లీగ్ లేదు .. అందుకే గత సంవత్సరమే స్టార్ట్ కాగా.. ఇప్పుడు రెండవ సీజన్ జరగనుంది. ఈ సీజన్ కు గాను ఇండియా ప్లేయర్ హనుమ విహారి అత్యధిక ధర పలికినట్లు తెలుస్తోంది. రాయలసీమ కింగ్స్ హనుమ విహారి కోసం ఇతర జట్లతో పోటీ పడి చివరికి రూ. 6.60 లక్షలకు కొనుగోలు చేసింది. ఇప్పటి వరకు ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో ఇదే అత్యధిక ధర కావడం విశేషం. ఆ తర్వాత ధీరజ్ అనే ప్లేయర్ కోసం గోదావరి టైటాన్స్ రూ. 5 .20 లక్షలు వెచ్చించి దక్కించుకుంది.
కాగా గత సీజన్ లో ఆడిన ఆటగాళ్లను ఆయా జట్లు కొంతమంది రిటైన్ చేసుకోగా , 580 మంది మాత్రమే వేలంలో పాల్గొనగా 120 మాత్రమే కొనుగోలు చేయబడ్డారు.