కృష్ణ తనయుడు మరియు నటుడు నరేష్ కు వ్యక్తిగత జీవితంలో వివాదాలతో సతమతమవుతున్న సంగతి తెలిసిందే. కొంతకాలం నుండి ఈయన సహనటి పవిత్ర లోకేష్ తో సహజీవనం సాగిస్తున్నారు. మరియు ఇతని ప్రేమకథ గురించి “మళ్ళీ పెళ్లి” పేరుతో సినిమా కూడా వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాను థియేటర్ లలో మరియు ఒటిటి లో ప్రసారం కాకుండా ఆపాలని తన మాజీ భార్య రమ్య రఘుపతి బెంగుళూరు సివిల్ కోర్ట్ లో పిటీషన్ వేసింది. అయితే తాజాగా బెంగుళూరు కోర్ట్ ఇచ్చిన తీర్పు ప్రకారం ఒక్కసారి ఏదైనా సినిమాకు సెన్సార్ బోర్డు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత దాని ప్రదర్శనను ఆపడం కుదరదు అంటూ రమ్య రఘుపతి పెట్టుకున్న పిటీషన్ ను కొట్టివేసింది. ఇక ఈమెపై నరేష్ వేసిన కేసును కూడా విచారించిన కోర్ట్ నరేష్ ఇంట్లోకి రమ్య రఘుపతి వెళ్ళడానికి హక్కు లేదని తేల్చి చెప్పింది.
దీనితో రమ్య రఘుపతికి డబుల్ స్ట్రోక్ తగిలినట్లయింది. కాగానరేష్ నటించిన సామజవరగమన మూవీ లో నరేష్ పాత్ర బాగా హైలైట్ అవడంతో మరిన్ని ఆఫర్లు క్యూ కడుతున్నాయి.