ఆఫ్గనిస్థాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో భారత బౌలర్ మహమ్మద్ షమీ హ్యాట్రిక్ తీయడం సంచలనం రేకెత్తించింది. షమీ తీసిన హ్యట్రిక్ వీడియోను అభిమానులు ఇప్పుడు పెద్ద ఎత్తున నెట్‌లో షేర్ చేస్తున్నారు.
ఆఫ్గనిస్థాన్‌తో ఉత్కంఠ భరితంగా సాగిన మ్యాచ్‌లో ఇండియా అద్భుతమైన విజయం సాధించిన విషయం విదితమే. ఆ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి కేవలం 224 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం ఆఫ్గనిస్థాన్ బ్యాట్స్‌మెన్ నిలకడగా ఆడుతూ లక్ష్యాన్ని ఛేదించేట్లు కనిపించారు. కానీ బుమ్రా, షమీల అద్భుతమైన బౌలింగ్‌తో భారత్ విజయం సాధించింది.
అయితే ఆఫ్గనిస్థాన్ ఇన్నింగ్స్ చివరి ఓవర్లో భారత బౌలర్ మహమ్మద్ షమీ హ్యాట్రిక్ తీయడం సంచలనం రేకెత్తించింది. షమీ తీసిన హ్యట్రిక్ వీడియోను అభిమానులు ఇప్పుడు పెద్ద ఎత్తున నెట్‌లో షేర్ చేస్తున్నారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ హ్యాట్రిక్‌తో షమీ వరల్డ్ కప్ లలో హ్యాట్రిక్ తీసిన రెండో భారత బౌలర్ గా రికార్డులకెక్కాడు. 1987 వరల్డ్‌కప్ లో మొదటి సారిగా భారత బౌలర్ చేతన్ శర్మ హ్యాట్రిక్ సాధించగా.. ఆ తరువాత ఇప్పుడు షమీ ఆ ఘనత సాధించాడు.
What a way to end it @MdShami11! ???
Nabi c Pandya b Shami
Alam b Shami
Ur Rahman b ShamiIndia take an absolute thriller by 11 runs.
Watch the winning (and hat-trick) moment here!#INDvAFG | #TeamIndia | #CWC19 pic.twitter.com/q9fYvcR56z
— ICC (@ICC) June 22, 2019
ఇక వరల్డ్ కప్‌లలో చేతన్ శర్మ తరువాత సక్లెయిన్ ముస్తాక్ (1999), చామిందా వాస్ (2003), బ్రెట్ లీ(2003), లసిత్ మలింగా(2007), కీమర్ రోచ్ (2011), లసిత్ మలింగా (2011), స్టీవెన్ ఫిన్ (2015), జేపీ డుమినీ (2015)లు హ్యాట్రిక్‌లు సాధించారు.