జిమ్నాస్టిక్​ పోటీల్లో విద్యార్థుల ప్రతిభ

హైదరాబాద్​ : ఇటీవల నగరంలో జరిగాయి. ఈ పోటీల్లో హైదరాబాద్​ కు చెందిన జోయ్​ జిమ్నాస్టిక్స్​ అకాడమీ విద్యార్థలు ప్రతిభను కనబరిచారు. ఆయా కేటగిరీల్లో 34 మంది పాల్గొన్న ఈ పోటీల్లో జోయ్ అకాడమీకి చెందిన ​ స్టూడెంట్లు 22 మెడల్స్​ సాధించారు. కె జైశ్వీ, జి. అంజన, జి నిశ్చల, శియా, దీక్షిత ఆల్​రౌండర్​ చాంపియన్లుగా నిలిచారు. ఈ పోటీల్లో విద్యార్థులు ఈ ప్రతిభ కనబర్చడంసంతోషంగా ఉందనీ, రానున్న రోజుల్లో మరింత మందిని చాంపియన్లుగా తయారు చేస్తానని అకాడమీ హెడ్​ కోచ్​ అలికా జో అన్నారు.