Stumping Rule: క్రికెట్ లో కొత్త రూల్ తీసుకొచ్చింది ఐసీసీ. ప్రపంచ క్రికెట్ ను శాసిస్తున్న ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ పరిస్థితులకు తగ్గట్టు క్రికెట్ లో కొత్త కొత్త రూల్స్ ను తీసుకువస్తుంది. ఏ ఒక్కరి కోసమో కాకుండా ఆటగాళ్లని దృష్టిలో ఉంచుకొని పలు నిబంధనలను సడలిస్తు నయా రూల్స్ ను పరిచయం చేస్తుంది. నూతన సంవత్సరం సందర్భంగా ఐసీసీ మరో అడుగు ముందుకు వేసింది. స్టెంప్ అవుట్ విషయంలో ఐసీసీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది.
స్టెంప్ అవుట్ అప్పీల్ విషయంలో ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కొత్త రూల్ ను తీసుకువచ్చింది. ఈ రూల్ బ్యాటర్ల కోసం సానుకూలంగా మారనుంది. స్టంపింగ్ విషయంలో వికెట్ కీపర్ ఆప్పీల్ చేసినప్పుడు ఆన్ ఫీల్డ్ ఎంపైర్లు థర్డ్ అంపైర్ కు రిఫర్ చేస్తాడు. థర్డ్ అంపైర్ రిప్లైలో అల్ట్రా ఎడ్జ్ చేసి స్టంప్ అవుటా కాదా అని డిసైడ్ చేసి రిజల్ట్ ప్రకటిస్తాడు. కానీ తాజాగా ఐసీసీ కొత్త నిబంధనలను ప్రవేశపెట్టడంతో ఇకనుంచి థర్డ్ అంపైర్ కేవలం స్టంపింగ్ ను మాత్రమే చేయాలి. బ్యాట్ కు బంతి తాకిందా లేదా అన్న విషయాన్ని చూడకూడదు. ఇంతకుముందు అయితే బ్యాట్ ను తాకితే క్యాచ్ అవుట్ ఇచ్చేవారు. తాకకుంటే స్టెంప్ అవుట్ అప్పీల్ ను పరిశీలిస్తారు.