తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనిని కలిశారు. నియామక పరీక్షల నిర్వహణకు వారు అవలంభిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సంబంధించి పలు విషయాలను యూపీఎస్సీ చైర్మన్ తో వారు చర్చించినట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ అధికారుల కమిటీ సైతం ఒకటి రెండు రోజుల్లో యూపీఎస్సీని సందర్శించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం వారు ప్రభుత్వానికి నివేదిక సమర్పించానున్నారు. ఆ నివేదిక ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై నిర్ణయం తీసుకోనున్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో యూపీఎస్సీ చైర్మన్ మనోజ్ సోనిని కలిశారు. నియామక పరీక్షల నిర్వహణకు వారు అవలంభిస్తున్న విధానాలను అడిగి తెలుసుకున్నారు. టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకు సంబంధించి పలు విషయాలను యూపీఎస్సీ చైర్మన్ తో వారు చర్చించినట్లు తెలుస్తోంది. టీఎస్పీఎస్సీ అధికారుల కమిటీ సైతం ఒకటి రెండు రోజుల్లో యూపీఎస్సీని సందర్శించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. అనంతరం వారు ప్రభుత్వానికి నివేదిక సమర్పించానున్నారు. ఆ నివేదిక ఆధారంగా సీఎం రేవంత్ రెడ్డి టీఎస్పీఎస్సీ ప్రక్షాళనపై నిర్ణయం తీసుకోనున్నారు.