ఈరోజు జోహన్నేస్బర్గ్ లో భారత్ మరియు సౌత్ ఆఫ్రికా మధ్య జరుగుతున్న మూడో టి20 మ్యాచ్ లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా ఫీల్డింగ్ ఎంచుకుంది.అయితే బ్యాటింగ్ కి దిగిన భారత్ 20 ఓవర్లో 7 వికెట్ల కి 201 పరుగులు చేసింది. గిల్ కేవలం 12 పరుగులు చేయగా, మరో ఓపెనర్ జైశ్వాల్ 41 బంతుల్లో 60 పరుగులు చేశాడు. రింకు సింగ్ కేవలం 14 పరుగులు చేసి ఈ మ్యాచులో నిరాశ పరిచాడు .తిలక్ వర్మ డక్ అవుట్ గా వెను తిరిగాడు .ఈ మ్యాచ్లో కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ సెంచరీతో కదం తొక్కాడు.56 బంతుల్లో 7 ఫోర్లు 8 సిక్సర్లతో సెంచరీ పూర్తి చేశాడు.దీంతో T 20 ల్లో 4 వ సెంచరీ పూర్తి చేశాడు.అయితే సూర్య ఆ తరువాత బంతికి ఔటై ప్రేక్షకులని నిరాశకి గురి చేశాడు.ఇక సఫారీ బౌలర్లలో కేశవ్ మహారాజ్ 4 ఓవర్లో కేవలం 26 పరుగులు ఇచ్చి 2 వికెట్ల తో పర్వలేదనిపించాడు. కెరీర్లో తొలి మ్యాచ్ ఆడుతున్న బర్గర్ 43 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీయగా,విలియమ్స్ 46 పరుగులు సమర్పించుకున్నాడు.
ఇప్పటికీ తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కాగా రెండో మ్యాచ్లో డక్ వర్త్ లూయిస్ ప్రకారం దక్షిణాఫ్రికా ఇండియాపై గెలిచిన సంగతి తెలిసిందే. అయితే సిరీస్ సమం కావాలంటే ఈ మ్యాచ్ లో ఇండియా తప్పకుండా గెలువాల్సిన పరిస్థితి ఏర్పడింది