పోరాడి ఓడిన భారత్.. ధోని, జడేజా వీరోచిత ఇన్నింగ్స్ వృథా.. ఫైనల్‌కు చేరిన న్యూజిలాండ్

-

గెలుపే లక్ష్యంగా బ్యాటింగ్ బరిలోకి దిగిన కోహ్లీసేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగలింది. టాప్ ఆర్డర్ డమాల్ మంది. ఐదు పరుగులకే.. రాహుల్, రోహిత్ శర్మ, కోహ్లీ.. ఔట్ అవడంతో భారత్‌కు కష్టాల్లో పడింది.

లీగ్ దశ వరకు మొదటి స్థానంలో నిలిచిన భారత్.. నాలుగో స్థానంలో నిలిచిన న్యూజిలాండ్ చేతిలో సెమీస్‌లో ఓడిపోయింది. భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ అంటేనే వరుణుడు అడ్డుకుంటున్నాడు. లీగ్ దశలోనూ భారత్, న్యూజిలాండ్ మధ్య జరగాల్సిన మ్యాచ్ వరుణుడి కారణంగా రద్దయింది. తర్వాత సెమీస్‌లోనూ భారత్, న్యూజిలాండ్ మధ్య పోరు ఉండటంతో.. అక్కడ కూడా వరుణుడే అడ్డం తగిలాడు. దీంతో మ్యాచ్ రిజర్వ్‌డేకు మారింది. రిజర్వ్‌డే రోజున మిగిలిన ఓవర్లు ఆడి 239 పరుగులు చేసి 240 పరుగుల లక్ష్యాన్ని భారత్‌కు నిర్దేశించారు.

గెలుపే లక్ష్యంగా బ్యాటింగ్ బరిలోకి దిగిన కోహ్లీసేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగలింది. టాప్ ఆర్డర్ డమాల్ మంది. ఐదు పరుగులకే.. రాహుల్, రోహిత్ శర్మ, కోహ్లీ.. ఔట్ అవడంతో భారత్‌కు కష్టాల్లో పడింది. అయితే.. ధోని, జడేజా వీరోచిత ఇన్నింగ్స్ ఆడి మ్యాచ్‌ను గెలిపించే ప్రయత్నిం చేసినా.. వాళ్ల ప్రయత్నం వృథా అయింది. 49.3 ఓవర్లలో అన్ని వికెట్ల నష్టానికి భారత్ 221 పరుగులే చేసింది. దీంతో న్యూజిలాండ్ ఫైనల్‌కు చేరింది. భారత్ ఇంటికి చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news