నో యాక్టింగ్.. ఓన్లీ రియాలిటీ.. బిగ్ బాస్ 3 మరో ప్రోమో

-

ఇప్పటికే ఈ షోకు సంబంధించి హోస్ట నాగార్జున లుక్‌ను రిలీజ్ చేశారు. తర్వాత ఇప్పుడు ఈ ప్రోమోను రిలీజ్ చేసి రోజురోజుకూ బిగ్‌బాస్ షోపై ఆసక్తిని పెంచుతున్నారు.

కెమెరా ఆన్ కాగానే యాక్టింగులు మొదలు పెట్టేస్తారు అందరూ. కానీ అది అక్కడ కుదరదు. 24 గంటలు.. 64 కెమెరాలు.. నో యాక్టింగ్.. ఓన్లీ రియాలిటీ.. అంటూ బిగ్ బాస్ సీజన్ 3 కి సంబంధించిన మరో ప్రోమోను విడుదల చేశారు బిగ్ బాస్ నిర్వాహకులు. జులై 21, 2019న రాత్రి 9 గంటలకు ప్రారంభం కానున్నట్లు ఈ ప్రోమోలో అధికారికంగా ప్రకటించారు.

ఇప్పటికే ఈ షోకు సంబంధించి హోస్ట నాగార్జున లుక్‌ను రిలీజ్ చేశారు. తర్వాత ఇప్పుడు ఈ ప్రోమోను రిలీజ్ చేసి రోజురోజుకూ బిగ్‌బాస్ షోపై ఆసక్తిని పెంచుతున్నారు. నాగార్జున కూడా ఓ కోతి బొమ్మతో మాట్లాడుతూ బయట యాక్టింగ్‌లు ఉంటాయి కానీ.. షోలో కాదు.. అంతా రియాల్టీయే అంటూ ఈ ప్రోమోలో చెబుతాడు.

ఇక.. ఈ షోకు సంబంధించి ఇప్పటికే కంటెస్టెంట్ల ఎంపిక కూడా అయిపోయిందట. వాళ్లు ఎవరు అనేది మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. కాకపోతే.. వీళ్లే ఈసారి కంటెస్టెంట్లు అంటూ సోషల్ మీడియాలో కొన్ని పేర్లు వైరల్ అవుతున్నప్పటికీ.. కంటెస్టెంట్లు ఎవరు అనే విషయం మాత్రం షో ప్రారంభం రోజు మాత్రమే తెలిసే అవకాశం ఉంది. ఈసారి మొత్తం 14 మంది కంటెస్టెంట్లు 100 రోజుల పాటు హౌజ్‌లో గడపాల్సి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news