రాంచీలో నిప్పులు చెరుగుతోన్న ష‌మీ…. విజ‌యం దిశ‌గా భార‌త్‌

-

దక్షిణాఫ్రికాతో రాంచీ వేదికగా జరుగుతున్న మూడో టెస్టు మ్యాచ్‌లో టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ తన సెన్సేషనల్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. మరోసారి నిప్పులు చెరిగే బంతులతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్ లైనప్ ను కకావికలం చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో 162 పరుగులకే ఆలౌటై, ఫాలో ఆన్ లో పడిన సఫారీలను షమీ అస్సలు కుదుటపడనివ్వలేదు. బంతిని సమర్థంగా స్వింగ్ చేస్తూ 3 వికెట్లు తీసి సత్తా చాటాడు. షమీ విసిరిన బంతిని సరిగా అంచనా వేయలేక వికెట్ల ముందు దొరికిపోయాడు.

తొలి ఇన్నింగ్స్ లో అర్ధసెంచరీ సాధించిన జుబేర్ హంజా ఈసారి షమీ ధాటికి డకౌట్ అయ్యాడు. కెప్టెన్ డుప్లెసిస్ సైతం షమీ బాధితుడే. ప్రస్తుతం దక్షిణాఫ్రికా స్కోరు 4 వికెట్లకు 26 పరుగులు మాత్రమే. ప్రస్తుతం క్రీజులో ఓపెనర్ డీన్ ఎల్గార్ (16), వికెట్ కీపర్ హెన్రిచ్ క్లాసెన్ (0) ఆడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version