బిగ్‌బాస్‌: ఫైన‌ల్ కంటెస్టెంట్లు క‌న్‌ఫార్మ్‌

-

ఎన్నో భారీ అంచనాలతో ప్రారంభమైన బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-3 చివరి దశకు చేరుకుంది. విజయవంతంగా 13 వారాలు పూర్తి చేసుకుని 14 వారంలోకి అడుగుపెట్టింది. ఇక 17 మంది కంటెస్టంట్స్ తో మొదలైన షో లో ఆరుగురు మాత్రమే మిగిలారు. ఈ ఆరుగురులో ఐదుగురు సభ్యులు మాత్రమే ఫైనల్ కు చేరుకొనున్నారు. ఈ వారం కూడా నామినేషన్ కార్యక్రమం జరిగి…వచ్చే ఆదివారంలో ఒకరు ఇంటి నుంచి బయటకెళ్లిపోనున్నారు.

ఇక మిగిలిన ఐదుగురు ఫైనల్ లో తలపడతారు. అయితే ప్రస్తుతం ఉన్న ఆరుగురు సభ్యుల్లో నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోయే అవకాశం ఎక్కువ అలీ రెజాకే ఉన్నాయని తెలుస్తోంది. ఎందుకంటే అలీ ఒకసారి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి, మళ్ళీ వైల్డ్ కార్డు ద్వారా ఇంటిలోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. దీంతో అలీకి బయట పరిస్థితులు తెలుసుకుని గేమ్ ఆడతాడు. అయితే గత 13 వారాలుగా మిగతా సభ్యులు ఏమి తెలియకుండా గేమ్ ఆడుతున్నారు. కాబట్టి ప్రేక్షకులు మిగిలిన ఐదుగురు పట్ల కొంచెం పాజిటివ్ గా ఉన్నారు.

అసలు ఈ ఆదివారం ఎపిసోడ్లోనే అలీ ఇంటి నుంచి బయటకెళ్లిపోవాల్సింది. కానీ అలీ కంటే వితికానే ఇంటి నుంచి పంపేయాలని ప్రేక్షకులు ఎప్పటి నుంచో చూస్తున్నారు. మొదట్లోనే తమన్నా సింహాద్రి ఎలిమినేట్ కావడం వల్ల వితికా తప్పించుకుని 13 వారం వరకు వచ్చింది. ఆమె వ్యక్తిత్వం ఎవరికి నచ్చలేదు. అందుకే ఆమెని ఎలిమినేట్ అయ్యేలా ఓటింగ్ వేశారు. ఒకవేళ వితికా లేకపోయి ఉంటే అలీనే బయటకెళ్ళేవాడు.

కానీ ఈ సారి మాత్రం అలీనే హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతాడని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇక అలీ బయటకెళితే రాహుల్, శ్రీముఖి, బాబా భాస్కర్, శివజ్యోతి, వరుణ్ ఫైనల్ కు చేరుకుంటారు. అయితే వీరిలో రాహుల్, శ్రీముఖి, వరుణ్ లకు సొంత ఫ్యాన్ బేస్ ఉంది. బాబా భాస్కర్ ఎంటర్టైనెమెంట్ వల్ల ప్రేక్షకులు ఓటింగ్ వేస్తున్నారు. ఇక శివజ్యోతి ఎలాంటి ఫ్యాన్ బేస్ లేకుండానే ఇంటిలోకి వచ్చి, తన మంచి వ్యక్తిత్వంతో ఆకట్టుకుంది.

అలాగే బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ ల్లో కూడా అదరగొడుతూ, డ్యాన్స్, కామెడీ చేస్తూ మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది. ఇక హౌస్‌లో ఆమె ఎవ్వ‌రితోనూ గొడ‌వ‌లు లేకుండా అంద‌రి ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. అందుకే ఆమెకు ఫైనల్ కు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇక ఆలీ టాస్కుల్లో బాగానే పెర్పామ్ చేస్తున్నా ఓ సారి ఇంటి నుంచి బ‌య‌ట‌కు వెళ్లిరావ‌డం అత‌డికి మైన‌స్‌. ఇక ఆలీ హౌస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చాక ఎవ్వ‌రికి న‌చ్చ‌డం లేదు. చివ‌ర‌కు నాగార్జున సైతం పాత ఆలీ కావాల‌ని చెప్ప‌గా… అత‌డి భార్య సైతం అదే విష‌యం చెప్పింది. ఏదేమైనా ఆలీ ఎలిమినేట్ అయితే మిగిలిన ఐదుగురు ఫైనల్ కు వెళ్లొచ్చని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version