న్యూజిలాండ్‌తో జరిగిన మూడో వన్డేలో 168 పరుగులు భారీ తేడాతో టీమ్ఇండియా ఘన విజయం సాధించింది. 2-1 ఆధిక్యంతో సిరీస్ కూడా కైవసం చేసుకుంది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ 2-1 తేడాతో సొంతం చేసుకుంది.
235 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన న్యూజిలాండ్‌కు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. పేసర్లు హార్దిక్ (4/16), అర్షదీప్ సింగ్ (2/16), శివమ్ మావీ (2/12), ఉమ్రాన్ మాలిక్ (2/9) చెలరేగిపోవడంతో 12.1 ఓవర్లలో 66 పరుగులకే కుప్పకూలింది కివీస్. డారిల్ మిచెల్ (35), మిచెల్ సాంట్నర్ (13) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు.
ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. శుభ్‌మన్ గిల్ (63 బంతుల్లో 126*; 12 ఫోర్లు, 7 సిక్సర్లు) మెరుపు సెంచరీ తోడవ్వడం వల్ల నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 234 పరుగుల భారీ స్కోర్ చేసింది. రాహుల్ త్రిపాఠి (22 బంతుల్లో 44; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), సూర్య కుమార్ యాదవ్ (13 బంతుల్లో 24; ఫోర్, 2 సిక్సర్లు), హార్దిక్ పాండ్య (17 బంతుల్లో 30; 4 ఫోర్లు, సిక్స్) రాణించారు. ఇషాన్ కిషన్ (1) ఒక్కడే నిరాశపరిచాడు. ఇక కివీస్ బౌలర్లలో బ్రేస్‌వెల్, టిక్నర్, సోధీ, డారిల్ మిచెల్ తలో వికెట్ పడగొట్టారు.