మహిళల వన్డే వరల్డ్ కప్ లో టీమిండియా బోని కొట్టింది. వరల్డ్ కప్ లో భాగంగా ఇవాళ పాకిస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో టీమ్ ఇండియా గ్రాండ్ విక్టరీ సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 245 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే పాకిస్థాన్ జట్టు టార్గెట్ లో ఘోరంగా విఫలమై… 137 పరుగులకే ఆలౌట్ అయింది.
దీంతో టీమిండియా జట్టు 107 పరుగుల తేడాతో విజయ దుందుభీ మోగించింది. ఇక మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా.. 50 ఓవరల్లో 7 వికెట్లు కోల్పోయి… 244 పరుగులు చేసింది. ఇందులో స్పితి మందనా 52 పరుగులు చేయగా… దీప్తి శర్మ 40 పరుగులు చేసింది.
అలాగే… రానా 53 పరుగులు, పూజా 67 పరుగులు చేసి.. జట్టుకు భారీ స్కోర్ ను అందించారు. ఇక పాక్ జట్టులో ఓపెనర్ అమిన్ మినహా ఎవరూ రాణించలేదు. దీంతో 43 ఓవర్లలో 137 పరుగులకే పాక్ స్థాన్ జట్టు ఆలౌట్ అయింది. దీంతో పాకిస్థాన్ జట్టుపై రికార్డు పరుగుల తేడాతో విజయం సాధించింది ఇండియా.