‘అంపైర్ చీటింగ్’.. హాకీలో మహిళల జట్టు ఓటమి

-

మ్యాచ్​ ఆరంభమైన పది నిమిషాల్లోనే ఆస్ట్రేలియా క్రీడాకారిణి రెబెకా గ్రేయినర్​ గోల్ కొట్టింది. తొలి అర్ధభాగంలో భారత్​ ఒక్క గోల్​ సాధించకపోయినా.. ప్రత్యర్థికి గట్టి పోటీనిచ్చింది. తిరిగి ప్రారంభమైన తర్వాత భారత్​కు పెనాల్టీ కార్నర్​ లభించిన దాన్ని సద్వినియోగం చేసుకోలేదు​. లాల్​రెమ్సియామి కొట్టిన పెనాల్టీ కార్నర్​ను ఆస్ట్రేలియా గోల్ కీపర్​ అలేషియా పవార్​ అడ్డుకుంది. మ్యాచ్​ చివరి అంకానికి చేరుకున్నాక 49 నిమిషంలో వందన కటారియా గోల్​ కొట్టి భారత్​ను రేసులో నిలబెట్టింది.

మ్యాచ్​ 1-1తో డ్రా కావడం వల్ల పెనాల్టీ షూటౌట్​ను నిర్వహించారు. మొదట ఆస్ట్రేలియా క్రీడాకారిణి అంబ్రోషియా మాలోన్ కొట్టిన గోల్​ను భారత గోల్​కీపర్​ సవితా పూనియా తిప్పికొట్టింది. కానీ గడియారం సెట్​ చేయలేదంటూ మహిళా అంపైర్.. అంబ్రోషియాకు మరో అవకాశం ఇచ్చింది.

ఆ తర్వాత కొట్టిన మూడు గోల్స్​ను విజయవంతంగా పూర్తి చేసింది ఆస్ట్రేలియా. అయితే, అంపైర్​ తీరుపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఆసీస్ ఆటగాళ్లకు అనుకూలంగా అంపైర్ వ్యవహరించిందని నెటిజన్లు మండిపడుతున్నారు. ట్విట్టర్​లో ఛీటింగ్​ అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

అంతకుముందు జరిగిన కామన్వెల్త్‌ గేమ్స్‌లో హకీ విభాగంలో క్వార్టర్‌ఫైనల్‌లో 3-2 తేడాతో కెనడాపై టీమ్‌ఇండియా అద్భుత విజయం సాధించింది. పూల్‌ -ఏ చివరి మ్యాచ్‌లో విజయంతో సెమీస్‌ బెర్తును భారత్‌ ఖరారు చేసుకుంది. మూడో క్వార్టర్‌ వరకు 2-2తో సమంగా నిలిచిన ఇరు జట్లు.. చివరి క్వార్టర్‌లో 3-2 ఆధిక్యంలోకి దూసుకెళ్లడం వల్ల భారత్‌ గెలుపొందింది. పూల్‌-ఏలో రెండో స్థానంతో స్టేజ్‌దశను భారత్‌ ముగించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version