అండర్-19 ఆసియా కప్ 2024లో భాగంగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఇండియా విజయం సాధించింది. షార్జా క్రికెట్ స్టేడియంలో జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ లో భారత్ ఏడు వికెట్ల తేడాతో గెెలిచింది. భారత్ 21.4 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 175 పరుగులు చేసి విజయం సాధించింది. శ్రీలంకను సులువుగా ఓడించిన భారత్ ఫైనల్ లోకి అడుగుపెట్టింది. ఈ మ్యాచ్ విజయానికి హీరోలు వైభవ్ సూర్యవంశీ, చేతన్ శర్మ ఆయూష్ మత్రే. వైభవ్ 36 బంతుల్లో 67 పరుగులు చేయగా.. చేతన్ శర్మ 8 ఓవర్లలో 34 పరుగులిచ్చి మూడు వికెట్లు తీశాడు.
ఆయుష్ మ్హత్రే 10 ఓవర్లలో 37 పరుగులు ఇచ్చి రెండు వికెట్లను పడగొట్టాడు. అంతేకాదు.. 28 బంతుల్లో 34 పరుగులు కూడా చేశాడు. శ్రీలంక బౌలర్లలో విహాస్ థెవ్మిక, విరన్ చముదిత, ప్రవీణ్ మనీషా తలో వికెట్ తీశారు.