ఐపీఎల్ 2023 లో బెస్ట్ ఎకానమీ స్పెల్… భువనేశ్వర్ కుమార్ !

-

ఐపీఎల్ ప్రస్తుతం మంచి జోరుగా సాగుతోంది. ఐపీఎల్ టైటిల్ ను కొట్టాలని అన్ని ఫ్రాంచైజీలు కసిగా ఉన్నాయి. అయితే కసి ఒక్కటే ఉంటే సరిపోదు కదా… అందుకు తగిన విధంగా శ్రమిస్తేనే విలయాలు దక్కుతాయి. ముఖ్యంగా క్రికెట్ లో బౌలింగ్ , బ్యాటింగ్ మరియు ఫీల్డింగ్ మూడు విభాగాల్లో బాగా రాణిస్తేనే విజయం దక్కుతుంది. కాగా ఈ ఐపీఎల్ లో సం రైజర్స్ హైద్రాబాద్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ తన బౌలింగ్ తో అదరగొడుతున్నాడు. వికెట్లు ఎక్కువగా తీయలేకపోతున్నప్పటికీ ఇతని బౌలింగ్ లో పరుగులు చేయడం చాలా కష్టంగా ఉంది. ఈ సీజన్ లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్ లలో బెస్ట్ బౌలింగ్ స్పెల్ వేసి ఔరా అనిపించాడు.

నిన్న ఢిల్లీ హైదరాబాద్ ల మధ్య జరిగిన మ్యాచ్ లో ఈ గణాంకాలను భువి నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో 4 ఓవర్లు వేసిన భువి కేవలం పరుగులు 11 మాత్రమే ఇచ్చి 2 కీలక వికెట్లను తీశాడు. మరి ముందు ముందు ఇదే ప్రదర్శనతో ఆకట్టుకుంటాడా లేదా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news