నిన్న సాయంత్రం కోల్కతా మరియు గుజరాత్ ల మధ్య జరిగిన మ్యాచ్ ను ఈ సీజన్ అంతా గుర్తించుకునే ఫినిష్ ను ఇచ్చాడు కోల్కతా లెఫ్ట్ హ్యాండ్ హిట్టర్ రింకు సింగ్. ఆఖరి ఓవర్ కు పరుగులు చేయాల్సిన సమయంలో ఆఖరి అయిదు బంతులకు 5 సిక్సులు కొట్టి జట్టుకు విజయాన్ని అందించాడు. రింక్ సింగ్ సిక్సర్ల మోత చూసిన తర్వాత ప్రతి ఫ్రాంచైజీ యజమాని మరియు కోచ్ లకు అబ్బా… ఇలాంటి ప్లేయర్ మన జట్టులో కూడా ఒక్కడు ఉంటే చాలు అంటూ సంబరపడిపోయేవారు.
మాములుగా చాలా మ్యాచ్ లు ఆఖరి ఓవర్ కు 10 పైన పరుగులు చేయాలంటే టెన్షన్.. కొడతరా లేదా అని, కానీ 29 పరుగులు ఆరు బంతుల్లో చేయాలంటే అందరూ అసాధ్యం అనుకుంటారు. కానీ ది సూపర్ మాన్ రింక్ సిక్సర్ల సింగ్ చేసి చూపించాడు. వరుసగా అయిదు బంతులను స్టాండ్స్ లోకి పంపించి ఊహించని విజయాన్ని కోల్కత్త అభిమానులకు కానుకగా ఇచ్చాడు.