టెస్ట్ క్రికెట్ లో ఆడే అవకాశం రావడం ఎంతో గొప్పగా భావిస్తానని అన్నారు ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్. డబ్ల్యూటీసీ ఫైనల్ లో ఆస్ట్రేలియా జట్టు విజయం సాధించిన అనంతరం స్టార్క్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన టెస్ట్ క్రికెట్ ను ఆస్ట్రేలియా నుండి 500 కంటే తక్కువ మంది ఆడారని.. అందుకే తను టెస్ట్ క్రికెట్ ని ఎంతో స్పెషల్ గా భావిస్తానని అన్నారు.
డబ్బు ఇవాళ వస్తుంది, రేపు పోతుందని.. అందుకే ఐపీఎల్ నుండి వచ్చే డబ్బును కోల్పోయినందుకు అంతగా బాధగా లేదన్నారు. ఫ్రాంచైజీ క్రికెట్ ఆడితే వచ్చే డబ్బు కంటే ఆస్ట్రేలియా జట్టుకు ఆడడానికే తొలి ప్రాధాన్యత ఇస్తానని స్పష్టం చేశారు. అయితే ఐపీఎల్ లో మరోసారి ఆడడం తనకు ఇష్టమేనని.. కానీ ఫార్మాట్లతో సంబంధం లేకుండా ఆస్ట్రేలియా జట్టుకు వీలైనంత ఎక్కువ సేవలు అందించాలన్నదే తన లక్ష్యమని అన్నారు.