టీమ్ ఇండియా మాజీ పేసర్ ఇర్ఫాన్ పఠాన్ తొలిసారి తన భార్య సఫా బేగ్ ఫేస్ ను రివీల్ చేశాడు. పెళ్లైన ఎనిమిదేళ్ల తర్వాత తన సతీమణిని ఇర్ఫాన్ ప్రపంచానికి పరిచయం చేశాడు. వారి వివాహ వార్షికోత్సవం సందర్భంగా, ఆమెతో కలిసి ఉన్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అయింది.
‘నువ్వు చాలా బాధ్యతలు తీసుకున్నావు. నాకు ఓ మిత్రుడిలా, కమెడియన్గా, నా పిల్లలకు తల్లిగా వ్యవహరిస్తున్నావు. నువ్వు భార్యగా నా జీవితంలోకి రావడం అదృష్టంగా భావిస్తా. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు’ అని ఇర్ఫాన్ తన పోస్టు కింద క్యాప్షన్ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. సఫా బేగ్ చాలా అందంగా ఉన్నారంటూ నెటిజన్లు తెగ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇర్ఫాన్ భాయ్ బాబీ ఈజ్ సో బ్యూటీఫుల్ సో ఎలిగెంట్ జస్ట్ లుకింగ్ లైక్ ఏ వావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే గతంలో ఇర్ఫాన్ తన ఫ్యామిలీ ఫొటోలు షేర్ చేసినప్పుడు ఆ ఫొటోల్లో తన భార్య సఫా బుర్ఖా ధరించి కనిపించే వారు. తొలిసారి ఆమె ముఖంపై హిజాబ్ ధరించకుండా కనిపించారు.
Infinite roles mastered by one soul – mood booster, comedian, troublemaker, and the constant companion, friend, and mother of my children. In this beautiful journey, I cherish you as my wife. Happy 8th my love ❤️ pic.twitter.com/qAUW8ndFAJ
— Irfan Pathan (@IrfanPathan) February 3, 2024