నంది అవార్డులకు గద్దర్ పేరు పెట్టడం చాలా సంతోషంగా ఉంది : చిరంజీవి

-

హైదరాబాద్ లోని శిల్పా కళా వేదికలో తెలంగాణ ప్రభుత్వం పద్మఅవార్డులను ప్రకటించిన వారందరినీ సన్మానించింది. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, చిరంజీవికి పద్మవిభూషణ్ అవార్డు రాగా.. ఐదుగురు కళాకారులకు పద్మశ్రీ దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, ఉమామహేశ్వర్, ఆనందాచారి, విఠలాచార్యకి పద్మ శ్రీ పురస్కారం లభించింది. ఈ సందర్భంగా పద్మవిభూషణ్ చిరంజీవి మాట్లాడారు.

తొలుత పద్మ అవార్డును ప్రకటిస్తున్నారని ఆరోజు మధ్యాహ్నం ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. సాయంత్రం వరకు కూడా టీవీలో తన పేరు రాకపోవడంతో మార్చారేమోనని అయోమయంలో ఉన్నాం. కానీ ప్రధాని నరేంద్ర మోడీ తీసుకున్న నిర్ణయం చాలా హర్శించదగ్గదన్నారు.  పద్మ విభూషణ్ అవార్డు రాగానే ఇంత ఆనందపడుతున్నారు అని మా ఇంట్లో అడిగారు. తరలివచ్చిన ప్రముఖులు, వ్యక్తులు, వారం రోజులుగా ప్రశంసలు కురిపిస్తుండటం ఆ ఆనందం రెట్టింపు అయింది అని తెలిపారు. 

ఈ జన్మకి ఇది చాలు.. మా అమ్మ నాన్నను ఎప్పుడో చేసుకున్న పుణ్యపులం. నాకు తెలిసి ప్రప్రథమంగా అవార్డు చేసిన వెంటనే ఎప్పుడూ జరుగలేదు. దానికి ప్రధానమైన కారణం డైనమిక్ లీడర్, రేవంత్ రెడ్డి.. సహచరుల మంత్రులు స్పందించడం సంతోషకరంగా ఉందన్నారు. నంది అవార్డులకు ప్రజా గాయకుడు, గద్దర్ గారి పేరిట అవార్డులను ఇవ్వడం ఎంతో ఆనందం అన్నారు చిరంజీవి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం నంది అవార్డుల స్థానంలో కొత్త అవార్డులను ప్రవేశపెట్టడం శుభపరిణామం అన్నారు. రాజకీయాల్లో దుర్భాషలాడే వారిని పంపిచే శక్తి ప్రజలకే ఉందన్నారు చిరంజీవి. వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలు దిగజారిపోతున్నాయి. 

 

Read more RELATED
Recommended to you

Latest news