రాజ్ కోట్ వేదికగా ఇంగ్లండ్ తో జరిగిన మూడో టెస్ట్ లో 434 పరుగుల తేడాతో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఐదు టెస్టులు సిరీస్ లో 2-1 ఆధిక్యంలోకి భారత్ దూసుకెళ్లింది. 557 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్ భారత బౌలర్ల ధాటికి కేవలం 122 పరుగులకే కుప్పకూలింది. భారత స్పిన్నర్ రవీంద్ర జడేజా 5 వికెట్లతో ఇంగ్లండ్ జట్టు పతనాన్ని శాసించాడు.
కుల్దీప్ యాదవ్ రెండు, అశ్విన్ వికెట్ సాధించాడు. ఇంగ్లండ్ బ్యాటర్లలో లో యార్డర్ ఆటగాడు మార్క్ వుడ్(33) పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అంతకు ముందు ఓవర్ నైట్ స్కోరు 196/2తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా నాలుగు వికెట్లకు 430 పరుగులు చేసి రెండో ఇన్నింగ్స్ ను డిక్లెర్ చేసింది. భారత బ్యాటర్లలో యువ ఆటగాడు యశస్వీ జైశ్వాల్ మరో డబుల్ సెంచరీతో చెలరేగాడు. కేవలం 231 బంతుల్లో 14 ఫోర్లు, 10 సిక్స్ లతో తన డబుల్ సెంచరీ మార్క్ ను అందుకున్నాడు. ఓవరాల్ గా 238 బంతులను ఎదుర్కొన్నాడు జైస్వాల్. శుబ్ మన్ గిల్ (91), సర్ఫరాజ్ ఖాన్ 68 నాటౌట్ గా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్ భారత్ 445 భారీ స్కోర్ చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్ లో 257 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 122 పరుగులకు ఆలౌట్ అయింది.