రాప్తాడులో జరుగుతున్న సిద్ధం కార్యక్రమానికి సంబంధించిన అప్‌డేట్స్‌సోషల్ మీడియాలో దుమ్ములేపుతున్నాయి.సీఎం వైయస్ జగన్ ఆధ్వర్యంలో సిద్ధం-3 కార్యక్రమానికి రాయలసీమ జిల్లాల నుంచి భారీస్థాయిలో వైయస్ఆర్‌సీపీ నాయకులు, అభిమానులు, ప్రజలు తరలివచ్చారు.అలా వచ్చిన వారు సభా ప్రాంతాన్ని ఫోటోలు తీసి, అప్‌లోడ్ చేయడంతో ట్విట్టర్, ఫేస్‌బుక్‌లు సిద్ధం సభ ఫోటోలతో ట్రెండ్ అవుతున్నాయి.అటు ట్విట్టర్‌లో సిద్ధం హ్యాష్‌ట్యాగ్ దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో ట్రెండ్ అయింది. సీఎం రావటానికి ముందే సిద్ధం అప్‌డేట్స్ సోషల్ మీడియాను షేక్ చేశాయి.జగనన్న రంగంలోకి దిగితే గ్రౌండ్‌లోనే కాదు సోషల్ మీడియాలో కూడా ఊపేయగలమని మరోసారి నిరూపించారు.జగనన్న ఇస్ రోరింగ్‌లైన్ అని ఓ అభిమాని పెట్టిన హాష్ ట్యాగ్ కి వ్యూస్ వెల్లువెత్తాయి.
ఇక ఈ సభకు వచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డి ఈసారి రెట్టించిన ఉత్సాహంతో కనిపించారు. సభాస్థలి కి చేరుకున్న జగన్ ముందుగా ప్రజలకు అభివాదం చేశారు.జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జలసముద్రం వస్తే, రాప్తాడు సభకు జలసముద్రo వచ్చిందని చెప్తూ రాయలసీమ గడ్డకు మీ పౌరుషాల బిడ్డ జగన్ నిండు మనసుతో అభివాదం చేస్తున్నాడు అంటూ సీఎం ప్రసంగం ప్రారంభించారు.ఇదే వేదిక మీద నుంచి చంద్రబాబు నాయుడుకి సీఎం జగన్ ఒక సవాల్ విసిరారు.14 సంవత్సరాలు సీఎం గా పనిచేసిన చంద్రబాబు రైతులకు ప్రత్యేకంగా ఒక పధకమైనా తెచ్చారా అని ప్రశ్నించారు.అయ్యా చంద్రబాబు, మీ పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు గుర్తుకు వచ్చే పథకం ఒక్కటైనా ఉందా? అని నిలదీశారు.చంద్రబాబు పేరు చెబితే బడికి, కాలేజీకి వెళ్లే పిల్లలకైనా ఒక్క పథకం ఉందా అని సూటిగా ప్రశ్నించారు
సీఎం మాట్లాడుతూ.. రానున్న ఎన్నికల్లో యుద్ధం రెండు సిద్ధాంతాల మధ్య జరుగుతుందన్నారు. ఇది కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలను ఎనుకునే ఎన్నిక కాదని ఐదేళ్లకాలంలో ఇంటింటికి మన ప్రభుత్వం అందించిన సంక్షేమానికి డ్రామాలు ఆడే చంద్రబాబుకి మధ్య యుద్ధం జరగనుంది అని అన్నారు. ఈ యుద్ధం, మాట ఇచ్చి నిలబెట్టుకున్న వైసీపీకి మాటతప్పటమే ఆలవాటుగా ఉన్న పెత్తందారలకు మధ్య జరుగుతుందని అన్నారు. వేరే రాష్ట్రాల్లో ఉంటు మోసం చేయటానికి వచ్చి పోతున్న నాన్ రెడిడెంట్స్ ఆంధ్రస్ కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
కనీసం అవ్వాతాతలకైన మంచి చేశానని చెప్పుకునే పరిస్థితి ఉందా అని చంద్రబాబుని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పేరు చెబితే మంచి చేశాడని, కనీసం ఒక మంచి పథకం తీసుకువచ్చాడనుకోవటానికి ఒక్కటి కూడా గుర్తుకురాదని పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం చేసిన కనీసం ఒక్క మంచి పనైనా ఉందా అన్నారు. అసలు కనీసం బాగుపడిన స్కూల్స్, హాస్పీటల్స్ ఉన్నాయా అని ప్రశ్నించారు.మరోసారి వైసీపీ అధికారంలోకి రావడం ఖాయమని, ఈ ఎన్నికల తరువాత టీడీపీ కనుమరుగు కాక తప్పదని చెప్పారు.
చంద్రబాబు వంచన భరించలేకే ఐదేళ్ల క్రితం ప్రజలంతా, చొక్క మడతేసి బాబుకు ఉన్న కూర్చీని మడిచి వారిని పార్టీని శాసనసభలో 120 నుంచి 23కి తగ్గించారని అన్నారు. మరోసారి చోక్క మడతపెట్టేందుకు సిద్ధామా అని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు.14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు పేరు చెబితే గుర్తుకువచ్చేది వెన్నుపోట్లు, మోసాలు అని ఈ పెద్దమనిషి చేయలేని పనులన్ని ఈ 57 నెలల పాలనలోనే చేసి చూపించామని అన్నారు.ప్రతి అక్కచెల్లెమ్మ, ప్రతి రైతు, ప్రతి అవ్వాతాత, ప్రతి విద్యార్ధి మనుసులో చోటు సంపాదించుకోగలిగామని చెప్పారు.ఈ 57 నెలల్లో వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులను ప్రతి ఒక్కరు గమనించాలని సూచించారు. ప్రభుత్వంలోని పథకాలు తీసుకున్న లబ్ధిదారులు స్టార్ క్యాంపెయినర్లుగా బయటికి వచ్చి ప్రతి ఒక్కరికి చెప్పాలన్నారు.మొదటి సారి ఛాన్స్ ఇస్తేనే రైతన్నకు రైతు భరోసాని ఇచ్చామనిపగటి పూటే విద్యుత్ అందుబాటులోకి తీసుకువచ్చామన్నారు.