SRH గ్రాండ్ విక్టరీతో కావ్య పాప ఫుల్ ఖుష్.. వీడియో వైరల్

-

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో హైదరాబాద్‌ తొలి విజయాన్ని నమోదు చేసింది. హైదరాబాద్ ఉప్పల్‌ వేదికగా జరిగిన మ్యాచ్‌లో ముంబయిని 31 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన హైదరాబాద్‌ ఐపీఎల్‌లోనే రికార్డు స్థాయి స్కోరు (277/3)ను సాధించింది.హైదరాబాద్‌ గ్రాండ్ విక్టరీతో నెట్టింట ఫ్యాన్స్ సంబురం మామూలుగా లేదు. ఓవైపు అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులతో ఆటగాళ్లను ముంచేస్తుంటే.. హైదరాబాద్ టీమ్ విజయంతో ప్రపంచంలో ప్రస్తుతం అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమే అంటూ టీమ్ యజమాని కావ్యా మారన్ను వైరల్ చేస్తున్నారు.

గత కొన్నేళ్లుగా హైదరాబాద్ జట్టు ప్రదర్శనతో అంతగా సంతృప్తిగా లేని ఆమె.. ఆ జట్టు ఎప్పుడు మ్యాచ్ ఆడి ఓడినా డల్గా కనిపించేవారు. కానీ బుధవారం రోజున ఉప్పల్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆమె నవ్వుతూ సంతోషంగా కనిపించారు. తన టీమ్ మెంబర్స్ ఆడుతున్న గేమ్ చూస్తూ మెస్మరైజ్ అయిపోయారు. స్టేడియంలో బ్యాటర్లు ఫోర్లు, సిక్సులు బాదుతుంటే మరోవైపు కావ్య ఆ గేమ్ను ఎంజాయ్ చేస్తూ కేరింతలు కొట్టారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news