కరీంనగర్ జిల్లా సుభాష్ నగర్ లో దారుణం జరిగింది. భర్తను కట్టేసి కొట్టి చంపింది ఓ భార్య. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సుభాష్ నగర్ లో గురువారం జరిగింది. తరచు గొడవ చేస్తున్నాడని నెపంతో భర్త హేమంత్ ని చంపింది భార్య రోహితి. పడుకున్న భర్త పై వేడి నీళ్ళు పోసిన భార్య రోహితి….అనంతరం కొట్టడంతో అతను మరణించాడు.
తీవ్ర గాయాలతో జిల్లా ఆస్పత్రిలో చేరిన తర్వాత…భర్త హేమంత్ మరణించాడు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున మృతిచెందాడు భర్త హేమంత్. కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు పారిశుద్ధ కార్మికురాలుగా పనిచేస్తోంది రోహితి. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు 3 టౌన్ పోలీసులు.