నిర్మాతతో కిదాంబి శ్రీకాంత్ ఎంగేజ్ మెంట్.. సీన్ లోకి దర్శకుడు రామ్ గోపాల్ వర్మ

-

బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కిదాంబి శ్రీకాంత్ టాలీవుడ్ సినీ పరిశ్రమకు చెందిన ఓ అమ్మాయిని పెళ్లాడబోతున్నాడు. ఆమె మరెవ్వరో కాదండోయ్.. వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మేనకోడలు శ్రావ్య వర్మ. ప్రస్తుతం శ్రావ్య టాలీవుడ్ లో పలువురికి కాస్ట్యూమ్ డిజైనర్ గా, నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. గతంలో ప్రపంచ నెంబర్ 1 గా ఉన్న బ్యాడ్మింటన్ ప్లేయర్. అయితే  ఏపీకి చెందిన కిదాంబి శ్రీకాంత్ ఈమెను పెళ్లి చేసుకోబోతున్నాడు. శనివారం రాత్రి వీరికి ఎంగేజ్ మెంట్ జరిగింది.

తాము నిశ్చితార్థం చేసుకున్నట్టు శ్రావ్య తన సోషల్ మీడియా ఖాతాలో ఫొటోలను పోస్ట్ చేసింది. దీంతో ఎవ్వరీ శ్రావ్య వర్మ అంటూ నెటిజన్స్ గూగుల్ లో తెగ వెతుకుతున్నారు.   ఈ తరుణంలో వీరికి పలువురు శుభాకాంక్షలు చెబుతున్నారు. మరోవైపు శ్రావ్య స్టార్ హీరోలు అక్కినేని నాగార్జున, విజయ్ దేవరకొండ, విక్రమ్, వైష్ణవ్ తేజ్, శ్రావ్య కాస్ట్యూమ్ డిజైనర్ గా ఉన్నారు. గుడ్ లక్ సఖి అనే మూవీకి నిర్మాతగా కూడా వ్యవహరించారు.

Read more RELATED
Recommended to you

Latest news