KKR vs SRH 2024, IPL Qualifier 1 Live Streaming: ఐపీఎల్ క్వాలిఫైయర్-1లో SRHకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు స్టార్ స్పోర్ట్స్ ట్వీట్ చేసింది. సామాజిక మాధ్యమాల్లో 51 శాతం మంది SRHకు అనుకూలంగా, 49 శాతం మంది KKRకు అనుకూలంగా ఓటు వేశారని పేర్కొంది. ఏమైనప్పటికి మైదానంలో ఇరు జట్ల మధ్య హోరాహోరీ తప్పదని తెలిపింది. రేపు గుజరాత్ లోని అహ్మదాబాద్ లో KKR, SRH మధ్య రాత్రి 7:30 గంటలకు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఫైనల్ చేరుతుంది.

కోల్‌కతా నైట్ రైడర్స్ XII: రహమానుల్లా గుర్బాజ్ (WK), సునీల్ నరైన్, అంగ్క్రిష్ రఘువంశీ/నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్ (c), వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, మిచెల్ స్టార్క్, హర్షిత్ రాణా, వరుణ్ చకరవర్తి
సన్‌రైజర్స్ హైదరాబాద్ XII: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, నితీష్ రెడ్డి, రాహుల్ త్రిపాఠి, హెన్రిచ్ క్లాసెన్ (WK), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (c), సన్వీర్ సింగ్, భువనేశ్వర్ కుమార్, విజయకాంత్ వియాస్కాంత్