175పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్తాన్ రాయల్స్, 20ఓవర్లలో 137 పరుగులు మాత్రమే చేయగలిగింది. 37పరుగుల తేడాతో కోల్ కతా నైట్ రైడర్స్ విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఓపెనర్లుగా దిగిన జోస్ బట్లర్, స్టీవ్ స్మిత్ సరైన ఆరంభాన్ని అందించలేకపోయారు. జోస్ బట్లర్ 21పరుగులు చేయగా స్టీవ్ స్మిత్ 3పరుగులకే ఔటయ్యాడు. మిగతా వాళ్లలో రాహుల్ తేవాటియా, టామ్ కరన్ తప్ప మరెవరూ కూడా రెండంకెల స్కోరు కూడా చేయలేకపోయారు.
టామ్ కరన్ 54పరుగులు( 36బంతుల్లో 2ఫోర్లు, 3సిక్సర్లు) చేయడంతో రాజస్తాన్ కి ఒక డీసెంట్ స్కోరు అందింది. కానీ ఓడిపోతుందని అనుకున్న టైమ్ లో శక్తిమేర స్కోరును పెంచే ప్రయత్నం చేసాడే తప్ప గెలుపువైపు తీసుకెళ్ళలేకపోయాడు. ఇక కోల్ కతా బౌలర్ల విషయానికి వస్తే శివమ్ మావి, నాగర్ కోటి, వరుణ్ చక్రవర్తి తలా రెండు వికెట్లు తీసుకోగా, సునీల్ నరైన్, పార్థ్ కమ్మిన్స్, కుల్ దీప్ యాదవ్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.