IND VS Zim : కేఎల్‌ రాహుల్‌ ప్రపంచ రికార్డు

-

టీమిండియా యువ జట్టు జింబాబ్వే పర్యటనలో శుభారంభం చేసింది. గురువారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా జింబాబ్వే పై పది వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలోనే జట్టు కెప్టెన్ గా ఉన్న కేఎల్ రాహుల్ ఒక అరుదైన ఫీట్ అందుకున్నాడు. కేవలం ఒక్క విజయంతోనే దిగ్గజాల సరసన చేరిపోయాడు. విషయంలోకి వెళితే టీమిండియా కి వన్డేల్లో 10 వికెట్ల తేడాతో విజయాన్ని అందించిన ఎనిమిదవ కెప్టెన్ గా కేఎల్ రాహుల్ నిలిచాడు.

ఇంతకుముందు 1975లో వెంకట రాఘవన్, 1984లో సునీల్ గవాస్కర్, 1997లో సచిన్ టెండూల్కర్, 1998లో మహమ్మద్ హజారుద్దీన్ ఈ ఫీట్ సాధించగా, ఇక సౌరవ్ గంగూలీ 2001లో 10 వికెట్ల తేడాతో విజయం అందుకోగా ఆ తర్వాత ఈ ఫీట్ ను 2016లో ఎంఎస్ ధోని అందుకున్నాడు. మధ్యలో కోహ్లీ చాలా కాలం కెప్టెన్ గా వ్యవహరించినప్పటికీ ఈ ఫీట్ ను అందుకోలేకపోయాడు. అయితే మళ్లీ రోహిత్ శర్మ 2022లో 10 వికెట్లు తేడాతో వన్డేలో ఈ ఘనత సాధించాడు. తాజా విజయంతో కేఎల్ రాహుల్ ఈ జాబితాలో చేరిపోయాడు.

Read more RELATED
Recommended to you

Latest news