రెండు విమానాలు ఢీ.. పలువురు మృతి!

అమెరికాలోని కాలిఫోర్నియాలో రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని వాట్సన్‌విల్లేలోని మున్సిపల్ విమానాశ్రయంలో రెండు విమానాలు ఒకే సమయంలో దిగేందుకు ప్రయత్నించాయి.

ఈ క్రమంలో ఒకదానికొకటి ఢీకొన్నాయని అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందినట్లు అధికారులు తెలియజేశారు. అయితే ఎంత మంది ప్రయాణించారనే విషయంపై క్లారిటీ లేదు.

ఈ మేరకు విమానయాన అధికారులు ప్రాథమిక దర్యాప్తు చేస్తున్నారు. ఈ మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు చేపట్టారు. ఈ మేరకు మృతదేహాలను మార్చరీకి తరలించారు. అలాగే ప్రమాదానికి గురైన విమానాలు తొలగించే పని నిమగ్నమయ్యారు.