ఇంగ్లాండ్ వన్ డే కప్ లో భాగంగా గత కొన్ని రోజులుగా జరుగుతున్న టోర్నీలో ఈ రోజు జరిగిన మొదటి సెమీఫైనల్ లో వార్విక్ షైర్ మరియు హాంప్ షైర్ లు తలపడగా, ఈ మ్యాచ్ కేవలం 46 ఓవర్ లకే ముగిసిపోయింది. మొదట బ్యాటింగ్ చేసిన వార్విక్ షైర్ హాంప్ షైర్ బౌలింగ్ ను అంచనా వేయడంలో పొరపాటు చేయడంతో కేవలం 93 పరుగులకే ఆల్ అవుట్ అయింది. వన్ డే మ్యాచ్ లో ఇంత దారుణమైన ఆటతీరును కనబరిచిన విధానం పట్ల ఇంగ్లాండ్ అభిమానులు ఎంతో నిరాశలో ఉన్నారు. ఈ ఇన్నింగ్స్ లో వార్విక్ షైర్ ను దెబ్బ తీసిన బౌలర్ లియామ్ డాసన్.. ఇతను తన దైన స్పిన్ మాయతో 41 బంతులను విసిరి కేవలం పరుగులు మాత్రమే ఇచ్చి 7 కీలకమైన వికెట్లను సాధించాడు.
దానితో వార్విక్ షైర్ జట్టు 93 పరుగుల వద్దనే తన ఇన్నింగ్స్ ను ముగించింది. అనంతరం ఛేజింగ్ కు వచ్చిన హాంప్ షైర్ కేవలం 19 .1 ఓవర్ లలోనే లక్ష్యాన్ని చెందించి అద్భుతమైన విజయాన్ని అందుకుని ఫైనల్ కు ఘనంగా చేరుకుంది.