గుకేష్ దొమ్మరాజు.. గత నాలుగైదు రోజులుగా ఈ పేరు ఇంటర్నెట్లో మారుమోగుతోంది. దానికి కారణం.. వరల్డ్ యంగెస్ట్ ఛాంపియన్ గా గుకేష్ ఎదగడమే. ఇటీవల జరిగిన టోర్నమెంట్లో చైనాకు చెందిన డింగ్ లిరెన్ ని ఓడించి గుకేష్ దొమ్మరాజు వరల్డ్ యంగెస్ట్ ఛాంపియన్గా చరిత్ర సృష్టించాడు.
ప్రస్తుతం గుకేష్ దొమ్మరాజు గురించి ఇంటర్నెట్లో తెగ వెతుకుతున్నారు. ప్రస్తుతం అతని గురించి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకుందాం.
మొదటగా గుకేష్ దొమ్మరాజు తెలుగు కుటుంబానికి చెందినవాడు. ఎస్.. తమిళనాడులోని చెన్నైకి చెందిన తెలుగు వాళ్ళైన రజినీకాంత్, పద్మ దంపతులకు గుకేష్ జన్మించాడు.
గుకేష్ తండ్రి రజనీకాంత్ ఈ ఎన్ టి స్పెషలిస్ట్ అయితే అమ్మ మైక్రోబయాలజిస్ట్ గా వర్క్ చేస్తున్నారు.
గుకేష్ తల్లిదండ్రులు.. చెస్ మీద అతనికి ఉన్న ఆసక్తిని గమనించి నాలుగవ తరగతి పూర్తయిన తర్వాత.. స్కూలుకి పంపించడం మానేశారు. పూర్తిగా చెస్ మీదనే ఫోకస్ పెట్టేలా కోచింగ్ ఇప్పించారు.
ఐదుసార్లు వరల్డ్ ఛాంపియన్ గా రికార్డు సృష్టించిన విశ్వనాథన్ ఆనంద్ గుకేష్ కి మెంటార్ గా ఉన్నారు. 12 సంవత్సరాల ఏడు నెలల 17 రోజుల వయసులో ఇండియాలో యంగెస్ట్ గ్రాండ్ మాస్టర్ గా ఎదిగాడు గుకేష్.
చెస్ ఒలింపియాడ్ 2024 లో బంగారు పతకం సాధించిన ఓపెన్ విభాగంలో గుకేష్ ఒక ఆటగాడిగా ఉన్నాడు.