ఇంగ్లాండ్ టెస్ట్​ జట్టు హెడ్​ కోచ్​గా మెక్​కలమ్

-

ఇంగ్లాండ్‌ టెస్ట్‌ జట్టుకు హెడ్‌ కోచ్‌ గా న్యూజిలాండ్‌ మాజీ ఓపెనర్‌ బ్రెండన్‌ మెక్‌ కలమ్‌ నియామకం అయ్యారు. ఐపీఎల్‌ లో కేకేఆర్‌ హెడ్‌ కోచ్‌ అయిన మెక్‌ కలమ్‌ ఇంగ్లాండ్‌ జట్టుకు కూడా కోచ్‌ గా నియామిస్తారని ప్రచారం జరిగింది. ఇంగ్లాండ్‌ అండ్‌ వేల్స్‌ క్రికెట్‌ బోర్డు తాజా ప్రకటనతో ఆ ప్రచారం నిజమైంది. ఈసీబీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాబ్‌ కీ.. గత కొన్ని రోజులుగా మెక్‌ కలమ్‌ తో జరిపిన సుదీర్ఘ చర్చల అనంతరం.. నియామకాన్ని ప్రకటించారు.

ఏడాది కాలంగా ఇంగ్లాండ్‌ జట్టును పరాజయాలు వెంటాడుతున్నాయి. స్వదేశంలో న్యూజిలాండ్‌ తో ఓడటం.. యాషెస్‌ సిరీస్‌ లో ఆసీస్‌ చేతిలో 4-0 ఘోర పరాజయాన్ని చవిచూడటం కారణంగా జట్టుతో పాటు బోర్డుపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతకు ముందు ఇండియాతో జరిగిన సిరీస్‌ లో ఇంగ్లాండ్‌ టీం ఓడిపోయింది. దీంతో దిద్దు బాటు చర్యలకు దిగింది ఈసీబీ. అందులో భాగంగానే ఇటీవల జో రూట్‌ ను కెప్టెన్‌ బాధ్యతల నుంచి తప్పించింది. ఈ నేపథ్యంలోనే కోచ్‌ గా మెక్‌ కలమ్‌ ను నియమించింది.

Read more RELATED
Recommended to you

Latest news