నీటి సంపులో పడి 2 ఏళ్ల బాలుడు మృతి.. హైదరాబాద్ లో ఘటన..

కొందరి నిర్లక్ష్యం మరొకరికి ప్రాణ సంకటంగా మారుతోంది. ఇంటిలో ఉన్న సంపు పై కప్పు మూయకపోవడంతో ఓ బాలుడు మృతి చెందిన ఘటన హైదరాబాద్ పేట్ బషీరాబాద్‌లో విషాద ఘటన చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .. పెట్ బషీరాబాద్ లోని గుండ్లపోచంపల్లి ఎస్సి కాలనీలో ఓ ఇంటి ఆవరణలో 2 ఏళ్ళ బాలుడు ఆడుకుంటున్నాడు. అయితే.. ఆ సమయంలో అక్కడే తెరిచి ఉన్న నీటి సంప్‌లో పడి‌ 2 ఏళ్ల బాలుడు కృష్ణ దాస్ మృతి చెందాడు. ఆడుకుంటూ ప్రమాదవశాత్తు సంప్‌లో పడి ప్రాణాలు విషయాన్ని కుటుంబ సభ్యులు ఆలస్యంగా గమనించడంతో అప్పటికే బాలుడు మృత్యు వాత పడ్డాడు.

Boy dies in sump

ఈ మేరకు కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే.. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నప్పుడు.. తగు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచనలు చేస్తూనే ఉన్నారు.. కానీ నిర్లక్యంగా వ్యవహరించి భారీ మూల్యాన్ని చెల్లించుకుంటున్నారు.. కృష్ణదాస్ మృతి తో ఒక్కసారిగా ఆ ఇంట్లో విషాద ఛాయలు అలుము కున్నాయి.