పీవీ సింధుకు ఐస్ క్రీమ్ ఆఫర్ చేసిన ప్రధాని.. రాకెట్ బహుమతిగా ఇచ్చిన సింధు.

-

టోక్యో ఒలింపిక్స్ ఆటల్లో కాంస్య పతకం గెలుచుకుని భారత్ తరపున ఒలింపిక్స్ ఆటల్లో రెండు పతకాలు గెలుచుకున్న క్రీడాకారిణిగా రికార్డు సృష్టించిన పీవీ సింధు కి అభినందనలు వెల్లువలా వచ్చాయి. తాజాగా ఒలింపిక్స్ ఆటగాళ్ళందరికీ ప్రధాని నరేంద్ర మోదీ గౌరవ సత్కారాలు చేసారు. ఆటగాళ్ళందరికీ బ్రేక్ ఫాస్ట్ ఏర్పాటు చేసారు. అందులో భాగంగా బాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధుతో ముచ్చటించిన ప్రధాని, ముందుగా నీకు ఐస్ క్రీమ్ ఇప్పించాలనుకున్నానని, ఐస్ క్రీమ్ ఇప్పించారు.

ఒలింపిక్స్ ఆటలకు సన్నద్ధమైన పీవీ సింధు తమ డైట్ లో ఐస్ క్రీమ్ తీసుకునేది కాదు. ఆ విధంగా చాలా రోజుల పాటు ఐస్ క్రీమ్ ముట్టుకోలేదు. ఈ నేపథ్యంలో దేశానికి కాంస్య పథకం పట్టుకొచ్చిన పీవీ సింధుకి ఐస్ క్రీమ్ ఆఫర్ చేసారు ప్రధాని నరేంద్ర మోదీ. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకున్న పీవీ సింధు, ప్రధాని సమక్షంలో అరుదైన గౌరవం లభించిందని తెలుపుతూ పోస్ట్ చేసింది. ఇంకా తన బాడ్మింటన్ రాకెట్ ని ప్రధానికి బహుమతిగా ఇచ్చినట్లు పేర్కొంది.

ఈ చిన్న బహుమతిని ప్రధానికి ఇస్తున్నట్లు పీవీ సింధు అభివర్ణించింది. మొత్తానికి దేశం మొత్తం గర్వించేలా చేసిన క్రీడాకారులందరికీ గౌరవ సత్కారాన్ని ప్రధాని అందజేసారు. ఈ కారణంగా యువతలో ఆటల పట్ల స్ఫూర్తి పెరగాలని, దేశం ఖ్యాతిని దశ దిశలా వ్యాపించేలా చేయాలని యువతకు సందేశం ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Latest news