గూగుల్‌ 25 ఏళ్ల హిస్టరీలో విరాట్ కోహ్లీ టాప్‌

-

విరాట్‌ కోహ్లీ ఈ పేరు తెలియని భారతీయుడు ఉండరంటే అతిశయోక్తి కాదు. క్రికెట్ తెలియని వారికి కూడా విరాట్ కోహ్లీ గురించి తెలుసు. ఈ రన్ మెషీన్ గురించి ఏ విషయమైనా సరే అభిమానులకు ఆసక్తే. అందుకే ఏం జరిగినా విరాట్ గురించి గూగుల్​లో వెతికేస్తుంటారు. అందుకేనేమో గూగుల్ పాతికేళ్ల చరిత్రలో అత్యదిక మంది సర్చ్ చేసిన క్రికెటర్​గా విరాట్ కోహ్లీ టాప్​లో నిలిచాడు.

ఈ ఏడాదితో గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌ 25 ఏళ్లను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలోనే తాజాగా గూగుల్‌ గడిచిన 25 ఏళ్లలో తమ సెర్చ్‌ ఇంజిన్‌లో అత్యధికంగా శోధించిన అంశాలతో ఓ వీడియోను రూపొందించి తమ ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసింది. ‘‘25 ఏళ్ల క్రితం ఈ ప్రపంచం వెతకడం (గూగుల్‌ సెర్చ్‌ను ఉద్దేశిస్తూ) మొదలు పెట్టింది. ఇక మిగతాదంతా చరిత్రే’’ అంటూ ఆ వీడియో ప్రారంభమైంది. అందులో ‘అత్యధిక మంది వెతికిన క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ నిలిచాడు.

అత్యధిక మంది శోధించిన అథ్లెట్‌గా ఫుట్‌బాల్‌ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో అగ్ర స్థానంలో ఉండగా.. అత్యధిక మంది వెతికిన ఆటగా ఫుట్‌బాల్‌ నిలిచింది. ఎక్కువ మంది శోధించిన మూవీ జానర్‌గా బాలీవుడ్‌ అగ్రస్థానంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news