ఐపీఎల్-2025లో భాగంగా ఇవాళ లక్నో వేదికగా ముంబయి ఇండియన్స్(MI), లక్నో(LSG) మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఇవాళ్టి ఆటలో ముంబయి టాస్ గెలవడంతో MI కెప్టెన్ హార్దిక్ పాండ్యా తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. ఇక లక్నో టీమ్ బ్యాటింగుకు దిగింది. గాయం కారణంగా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ ఇవాళ్టి గేమ్ ఆడటం లేదు. లక్నో జట్టులో బౌలర్ సిద్ధార్థ్ స్థానంలో పేస్ బౌలర్ ఆకాశ్ దీప్ చేరాడు.
ముంబయి టీమ్ ఇదే..
ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): విల్ జాక్స్, ర్యాన్ రికెల్టన్(WK), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్య(C), నమన్ ధీర్, రాజ్ బావా, మిచెల్ సాంట్నర్, దీపక్ చాహర్, అశ్వనీ కుమార్, విఘ్నేష్ పుత్తూర్, ట్రెంట్ బౌల్ట్
లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ ఇదే (ప్లేయింగ్ XI):
ఐడెన్ మార్క్‌రామ్, మిచెల్ మార్ష్, నికోలస్ పూరన్, రిషబ్ పంత్(Wk/C), ఆయుష్ బదోని, డేవిడ్ మిల్లర్, అబ్దుల్ సమద్, శార్దూల్ ఠాకూర్, దిగ్వేష్ సింగ్ రాఠీ, ఆకాష్ దీప్, అవేష్ ఖాన్