ధోని లేకుండా రోహిత్ మొదటిసారి అలా చేయబోతున్నాడు..!

ఇప్పటికీ ఐపీఎల్ చరిత్రలో సుదీర్ఘ ప్రస్థానాన్ని కొనసాగించిన ముంబై ఇండియన్స్ జట్టు ఐపీఎల్ లో ఇప్పటి వరకు నాలుగు సార్లు టైటిల్ గెలిచిన ఏకైక జట్టుగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఐదవ సారి కూడా టైటిల్ గెలిచేందుకు సిద్ధమైంది. ఐపీఎల్ సీజన్ లో ఎంతో విజయవంతమైన ప్రస్థానాన్ని కొనసాగించి.. మొదట ఫైనల్ పోరులో అడుగుపెట్టిన జట్టు గా రికార్డు సృష్టించింది ముంబై ఇండియన్స్ జట్టు.

క్వాలిఫైయర్ వన్ లో ఢిల్లీ క్యాపిటల్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ జట్టు ఘన విజయం సాధించింది. అయితే ఇప్పుడు వరకు ముంబై ఇండియన్స్ జట్టు ఐదు సార్లు ఫైనల్కు చేరుకుంది.. ఇక ముంబై ఫైనల్ కు చేరిన ప్రతి సారి కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో నే పోటీ పడింది. 5 సార్లు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుతో పోటీపడగా ముంబై ఇండియన్స్ నాలుగుసార్లు విజయం సాధించింది. కానీ మొదటిసారి చెన్నై సూపర్ కింగ్స్ తో కాకుండా వేరే జట్టుతో ఫైనల్లో తలపడేందుకు సిద్ధమవుతోంది ముంబై ఇండియన్స్ జట్టు.