తన రోల్ మోడల్ ఎవరో చెప్పిన రన్ మెషిన్ కింగ్ కోహ్లీ!

-

ఇండియా మాజీ కెప్టెన్ మరియు కీ ప్లేయర్ విరాట్ కోహ్లీ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. జట్టుకు ఎన్నో చిరస్మరణీయమైన విజయాలను అందించిన ఘనత విరాట్ కు దక్కుతుంది. అయితే… భార్య అనుష్కనే తన రోల్ మోడల్ అని స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ వెల్లడించారు.

ఓ ఈవెంట్ లో ‘మీ రోల్ మోడల్ ఎవరు?’ అని ప్రశ్నించగా…’జీవితంలో నా భార్యనే రోల్ మోడల్. నేను ఎవరు? ఎక్కడ ఉన్నాను? నా చుట్టూ ఏం జరుగుతోంది? అనే విషయాలు ఆమె నాకు తెలియజేస్తుంది. ఆమెను చూసి చాలా సార్లు ఇన్స్పైర్ అవుతుంటా’ అని కోహ్లీ వివరించారు.

ఇదే ఈవెంట్ లో కోహ్లీ మాట్లాడుతూ ‘WC గెలవాలని నా కంటే ఎక్కువగా ఎవరూ కోరుకోరు. నాకు ఛాలెంజెస్ అంటే ఇష్టం. ఆ ఛాలెంజెస్ లో WC కూడా ఒకటి. ఛాలెంజెస్ ను మనం స్వీకరించాలి. క్లిష్ట పరిస్థితులు ఎదురైతే ఎదుర్కోవాలి’ అని తెలిపారు. కాగా విరాట్, అనుష్క 2017లో వివాహం చేసుకోగా వీరికి ‘వామిక’ అనే కూతురు ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news